దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల జట్టును భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. వెస్టిండీస్ పర్యటనలో రాణించని ఓపెనర్ కెఎల్ రాహుల్ తన స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు, ఇతర బ్యాటర్లు మంచి ప్రదర్శన కనబరిచడంతో సిరీస్ను 2-0తో గెలిచారు.
ఆ స్థానంలో కొత్తగా షుబ్మాన్ గిల్ను ఎంపిక చేసారు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ లో ఫామ్‌లో ఉన్న పరిమిత ఓవర్ల ఓపెనర్ రోహిత్ శర్మను టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా ప్రయత్నించాలని చాలా మంది సూచిస్తున్నారు. అలాగే, యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, రిషబ్ పంత్ తన చివరి సిరీస్‌లో రాణించలేకపోతినప్పటికి తన స్థానాన్ని కాపాడుకోగలిగాడు.
టీమ్:
విరాట్ కోహ్లీ, షుబ్మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, హనుమా విహారీ, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.