ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో ఐనా తెలుగు మాద్యమంలో చదువుకునే వెసులుబాటు ఉండేది. కాని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ అవకాశం మన పిల్లలకి ఉండదు. ఎందుకంటె అందరు ఆంగ్లంలోనే చదువుకోవాలని జగన్ గారి ప్రభుత్వం చెబుతుంది.
అసలు ఆంగ్ల మాద్యమం ఎందుకు?
ప్రభుత్వం తో పాటు చాలా మందిలో ఉన్న భావన ఏంటంటే ఆంగ్ల మాద్యమంలో చదువుకుంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, బాగా అభివృద్ది చెంద వచ్చు అని అనుకుంటారు. కాని ఇది ఎంత వరకు నిజం? ఒకసారి ఇది ఆలోచించండి! మనం ఇంటర్ వరకు తెలుగులోనే చదువుకున్నప్పటికి పై చదువులు మాత్రం ఆంగ్లంలోనే కదా! మరి ఎందుకు ఏటేటా ఇంతగా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు? పై చదువుల్లో ఆంగ్లం నేరచుకున్నప్పటికి ఎందుకు అభివృద్ది చెందడం లేదు.
మాద్యమం కాదు, వ్యవస్త మారాలి!
అవును నిజం, మారాల్సింది మాద్యమం కాదు వ్యవస్త. ప్రభుత్వాలు ముందు ఉద్యోగ కల్పనపై దృష్ఠి పెట్టాలి. పెద్ద చదువుల్లో బోదనా నాన్నతను పెంచాలి. ఆంగ్ల మాద్యమంలో చదువుకున్న వారిలో నూటికి పది శాతం వారు ఉద్యోగాలు సాధిస్తున్నారు. మరి మిగితా వారి పరిస్థితి ఏమిటి? ఆ పది శాతంలో కూడా చాలా మంది విదేశాలకు తరలి వెళ్లే వారె కాని భారతదేశానికి చేసేదేమిటి?